తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే రాజాసింగ్​కు సంబంధించి వీగిపోయిన మరో కేసు - telangana varthalu

గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​కు సంబంధించిన ఓ కేసు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో వీగిపోయింది. వేర్వేరు కేసుల్లో పలువురు ప్రజా ప్రతినిధులు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.

ఎమ్మెల్యే రాజాసింగ్​కు సంబంధించి వీగిపోయిన మరో కేసు
ఎమ్మెల్యే రాజాసింగ్​కు సంబంధించి వీగిపోయిన మరో కేసు

By

Published : Feb 24, 2021, 8:25 PM IST

గోషామహల్ శాసనసభ్యుడు తిరంగ యాత్రకు సంబంధించిన మరో కేసు వీగిపోయింది. స్వాతంత్య్ర దినోత్సవాన అనుమతి లేకుండా తిరంగ యాత్ర నిర్వహించారన్న అభియోగంపై షాఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్​లో 2018లో నమోదైన కేసును ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది.

వేర్వేరు కేసుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, సంపత్ కుమార్, తదితర నేతలు కోర్టుకు హాజరయ్యారు. కాచిగూడ పోలీస్ స్టేషన్​లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో విచారణకు హాజరుకావాలని అంబర్ పేట శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్​కు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

ఇదీ చదవండి: యూనివర్సిటీ భూముల్లో రోడ్డు ఎలా నిర్మిస్తారు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details