హైదరాబాద్ జుమ్మెరాత్ బజార్లో అర్ధరాత్రి ఉద్రికత్త జరిగింది. స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్లోథ్ విగ్రహాన్ని పునర్ నిర్మించేందుకు ఓ వర్గం ప్రయత్నించింది. అనుమతిలేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులకు మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రావడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈఘటనలో ఎమ్మెల్యేతో పాటు పలువురికి గాయలయ్యాయి. రాజాసింగ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అన్యాయంగా పోలీసులు దాడి చేశారని... యోధురాలి విగ్రహం ప్రతిష్టిస్తుంటే దాడి చేస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని రాజాసింగ్ వెల్లడించారు.
లాఠీఛార్జ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్ తలకు గాయాలు - bjp leader
స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్లోథ్ విగ్రహాన్ని జుమ్మెరాత్ బజార్లో పునఃనిర్మించేందుకు ఓ వర్గం యత్నించిగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారు ఆందోళనకు దిగి పోలీసులపై రాళ్లు విసిరారు. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఆందోళనకారులకి మద్దతుగా వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తలకి గాయలయ్యాయి.
రాజాసింగ్ తలకు గాయాలు
ఇవీ చూడండి: నేడు పార్లమెంటు సభ్యులకు ప్రధాని విందు