తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రానికి తెలంగాణే దిక్సూచా...! - kcr

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం రైతు బంధు. ఇది ఇతర రాష్ట్రాలనే కాదు యావత్​ దేశాన్ని ఆకర్షించింది. ఇవాళ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కూడా ఇదే తరహాలో ఉంది. కేంద్ర పథకానికి రైతు బంధునే ఆధారంగా కనిపిస్తోందంటున్నారు నిపుణులు.

budjet

By

Published : Feb 1, 2019, 8:05 PM IST

parlament
తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. సాగు సమయంలో రుణ సమస్యలు తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు.. అన్నదాతలకు వరంగా మారింది. తెరాస మళ్లీ అధికారంలోకి రావడంలో పెట్టుబడి సాయం ఎంతగానో ఉపయోగపడిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
దేశవ్యాప్తంగా ఈ పథకం ఎన్నో రాష్ట్రాలను ఆకర్షించింది. పథకం అమలు తీరు పరిశీలించాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణకు అధికారులను పంపిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం చేయడానికి కసరత్తు మొదలు పెట్టింది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ పథకంపై ఆసక్తి చూపుతోంది. కేంద్రం కూడా దీనికి ఫిదా అయింది.
ఇవాళ్టి బడ్జెట్​లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కూడా... రైతు బంధు తరహాలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేలు కేటాయించనుండగా.. కేంద్రం ఐదెకరాల్లోపు భూమి ఉన్నవారికి ఏడాదికి రూ. 6 వేల చొప్పున 3 విడతల్లో అందిస్తామని ప్రకటించింది.
తెరాసకు ఓట్లు రాలినట్టుగానే తమకు రైతుల అనుగ్రహం ఉంటుందనే భావనతో ఈ పథకం తీసుకొచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజనకు మూలమైన రైతుబంధు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

ABOUT THE AUTHOR

...view details