రైతు బంధు సమితికి వెబ్ సైట్ను ఏర్పాటు చేసి, అనుబంధ శాఖలను లింక్ చేస్తూ.. కోఆర్డినేటర్లు, రైతులకు ఉపయుక్తంగా ఉండేలా చూడాలని.. సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం వర్చువల్గా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్కు ఆయన అధ్యక్షత వహించారు.
'రైతు బంధు సమితికి వెబ్ సైట్ను ఏర్పాటు చేయండి’
యాసంగిలో ధాన్య సేకరణ కార్యక్రమం చురుగ్గా జరుగుతోందని రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ ఒక్క సీజన్లోనే.. మక్క, వరి పంటల ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. ఇవాళ ఉదయం వర్చువల్గా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు.
Raithu Bandhu samithi meeting
యాసంగిలో ధాన్య సేకరణ కార్యక్రమం చురుగ్గా జరుగుతోందని పల్లా అన్నారు. ఈ ఒక్క సీజన్లోనే.. మక్క, వరి పంటల ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. జనుము, జీలుగు వల్ల భూమికి జరిగే మేలు గురించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని.. డైరెక్టర్ జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్నదాతలు తీసుకునే చర్యల్లో.. కోఆర్డినేటర్లు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:ఈటీవీ, ఈటీవీ భారత్ ఎఫెక్ట్: వజ్రాల గుట్టలో మట్టి మాఫియాపై విచారణ