దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరిగినందున... సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సూచించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటి కౌన్సిల్, డబ్యూఎన్ఎస్ కేర్స్ ఆధ్వర్యంలో సైబర్ భద్రతపై నిర్వహించిన సమావేశంలో సీపీతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి: సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ సిటీ సెక్యూరిటి కౌన్సిల్, డబ్యూఎన్ఎస్ కేర్స్ ఆధ్వర్యంలో సైబర్ భద్రత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి: సీపీ అంజనీకుమార్
సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఓ పోర్టల్‌ను దృశ్యమాధ్యమం ద్వారా అంజనీకుమార్ ప్రారంభించారు. త్వరలోనే ప్రతినెలా సైబర్ భద్రతపై విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:క్యాన్సర్‌ను ఆదిలోనే గుర్తిస్తే.. అంతం చేయొచ్చు: బాలకృష్ణ