ఉస్మానియా ఆస్పత్రి వరదనీటితో అల్లాడిపోతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి ఆస్పత్రిలోకి వరద నీరు చేరింది. రోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ఉస్మానియాలోకి వర్షపు నీరు.. ఆందోళనలో రోగులు, వైద్యులు
హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రి వర్షపు నీటితో నిండిపోయింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు హాస్పిటల్ పరిసరాలు చెరువును తలపిస్తున్నాయి. ఈ తరుణంలో ఆస్పత్రిలో ఉన్న రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆస్పత్రిలోకి వర్షపు నీరు.. ఇబ్బంది పడుతోన్న రోగులు
వర్షపు నీటితోపాటు మురుగునీరు కూడా రోగులుండే చోటకు ముంచెత్తడంతో ఆస్పత్రి పరిసరాలన్నీ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆస్పత్రి ఆవరణలోని సామగ్రి వరదనీటిలో కొట్టుకుపోయింది. అసలే శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి వర్షం ధాటికి ఎక్కడ కూలిపోతుందోనని రోగులు, డాక్టర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి :భారీ వర్షాలు.. రోడ్ల పైకి, ఇళ్లలోకి చేరుతున్న నీరు