రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. పశ్చిమ బంగా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు సూచించింది.
ఖమ్మంలో గరిష్ఠం
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 785 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. గరిష్ఠంగా ఖమ్మం జిల్లా ముదిగొండలో 7.8 సెం.మీ., ములుగు జిల్లా వాజేడు, కన్నాయిగూడెంలలో 6.8, 6.7 సెం.మీ. వర్షం కురిసినట్లు వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, మేడ్చల్ మల్కాజిగిరి, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అనేక మండలాల్లో వర్షం కురిసింది.
ఇదీ చూడండి :జగిత్యాల జిల్లాలో.. వెన్నలగండి పర్యాటకం