రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు ప్రకటించింది. ఉత్తర, తూర్పు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు నాగరత్న స్పష్టం చేశారు.
'నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం' - Hyderabad Weather Centre Latest News
రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

'నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం'