రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, వికారాబాద్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వర్షం కురుస్తూనే ఉంది.
RAINS: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - telangana varthalu
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి, తూర్పు, దక్షిణ జిల్లాలలో మరో రెండు రోజుల పాటు మెరుపులతో కూడిన వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. గ్రేటర్ పరిధిలో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పలు కాలనీలు జలమయమయ్యాయి.

గ్రేటర్ పరిధిలో లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కొండ, మెహదీపట్నం, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైస్, ప్యాట్నీ, మారేడ్పల్లి, రాంనగర్, హిమాయత్ నగర్, ఆర్టీసీక్రాస్ రోడ్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో నీరు నిలిచిపోయింది. రాత్రి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు వర్షం కారణంగా అవస్థలు పడ్డారు. మరో రెండు రోజుల వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: Dog kidnap: నిజామాబాద్లో కుక్క అపహరణ.. పీఎస్లో ఫిర్యాదు