చత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్రా మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో గురువారం ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు - వర్షాలు
గురు, శుక్ర వారాల్లో రాష్ట్రంలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వానలు పడతాయిని వెల్లడించింది.
రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు