రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో రాబోయే మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం పడుతుందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
రాబోయే మూడు రోజుల్లో వడగండ్ల వర్షాలు.! - వర్ష సూచన
రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.
![రాబోయే మూడు రోజుల్లో వడగండ్ల వర్షాలు.! rains in state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11696508-873-11696508-1620553949985.jpg)
మూడు రోజుల పాటు వర్షాలు
నైరుతి మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు...దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఆవర్తనం ఉన్నట్లు స్పష్టం చేసింది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైనట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.