నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారటంతో
ఆంధ్రప్రదేశ్,తెలంగాణరాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది.

ఈరోజు పశ్చిమ, నైరుతి తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి ఒకటి, రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.