నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోకి నైరుతి, పశ్చిమ దిశల నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది.
WEATHER REPORT: రాగల మూడు రోజులు వర్షాలు - rains in coming three days
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని తెలిపింది.
మూడు రోజుల పాటు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి: Kaleshwaram: కాళేశ్వరం పుష్కర ఘాట్లను తాకిన గోదావరి పరవళ్లు