రాష్ట్రంలో రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - hyderabad meteorological department
రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురువొచ్చని చెప్పింది.
రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఈ రోజు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంచాలకులు వివరించారు.
ఇవీ చూడండి: పేరుకే రైతు బీమాలు.. క్షేత్రస్థాయిలో అందని సాయాలు..