WEATHER REPORT: రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7వ తేదీన మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వెల్లడించింది.
మరోవైపు ప్రస్తుతం నడుస్తున్నది వానాకాలమైనా.. అనూహ్యమైన వేడి.. మండు వేసవి మాదిరిగా ఉక్కపోతలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శనివారం ఆదిలాబాద్ జిల్లా అర్లి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 39 డిగ్రీలు, ఆదిలాబాద్ పట్టణంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత పదేళ్ల సెప్టెంబరు నెల చరిత్రలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి అని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌లో 2015 సెప్టెంబరు 11న అత్యధిక ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు నమోదైనట్లు రికార్డు ఉంది. ఇప్పుడు దాని కంటే 3.2 డిగ్రీలు పెరిగింది.
కిషన్‌బాగ్‌లో రాత్రిపూటే 27.5 డిగ్రీలుశుక్రవారం రాత్రి రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో 27.5 డిగ్రీలు, ఎల్‌బీ స్టేడియం వద్ద 25.6, భద్రాచలంలో 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సెప్టెంబరు నెలలో రాత్రిపూట సాధారణ ఉష్ణోగ్రత 22.3 డిగ్రీలుంటుంది. ఇప్పుడు 3 డిగ్రీలకు పైగా పెరిగిపోయింది.