తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు..!

WEATHER REPORT: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు..!
రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాలు..!

By

Published : Jul 28, 2022, 2:26 PM IST

WEATHER REPORT: రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈరోజు ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తు వద్ద కొనసాగుతుందని తెలిపారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 3.1 కి.మీ. ఎత్తు మధ్య విస్తరించి ఉందని వాతావరణ సంచాలకులు నాగరత్న పేర్కొన్నారు. బుధవారం రోజున ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం.. ఈరోజు బలహీన పడిందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details