రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు.. 30 నుంచి 40 కి.మీ. వేగవంతమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - three days rains in telangana
రాగల మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడటమే ఇందుకు కారణమని పేర్కొంది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఉత్తర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇవాళ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు.