ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న వాయుగుండం.. జబల్పూర్కు ఈశాన్య దిశగా 75 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడి తీవ్ర అల్పపీడనముగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలు
ఇదీ చూడండి: చిరునవ్వుల చిన్నమ్మకు వినూత్న నివాళి!