తెలంగాణ

telangana

ETV Bharat / state

Weather forecast : ఏపీలో పడమర గాలులు... తెలంగాణలో మోస్తారు వర్షాలు - ap news

ఏపీలో పడమర గాలుల కారణంగా రాగల మూడు రోజుల్లో పలుచోట్ల తేలికపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోను రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అటు

weather forecast
weather forecast

By

Published : Aug 1, 2021, 7:59 PM IST

రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు ఒకట్రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఏపీలో పడమరగాలుల ఎఫెక్ట్​

ఏపీలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పడమర గాలుల కారణంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో సోమ, మంగళవారాల్లో.. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురొచ్చని వెల్లడించింది. రాయలసీమలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని ప్రకటించింది.

ఇదీ చూడండి:WEATHER REPORT: బలహీనంగా రుతుపవనాలు.. మాదిరి వర్షాలు కురిసే అవకాశం

ABOUT THE AUTHOR

...view details