తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో నేడు అక్కడక్కడ వర్షాలు - latest news on Rainfall in the state today

రాష్ట్రంలో నేడు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి వల్ల వర్షాలు పడనున్నట్లు వెల్లడించింది.

Rainfall in the state today
రాష్ట్రంలో నేడు అక్కడక్కడ వర్షాలు

By

Published : Mar 30, 2020, 6:00 AM IST

కేరళ నుంచి విదర్భ మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. తమిళనాడు నుంచి శ్రీలంక వరకూ ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ప్రభావం వల్ల రాష్ట్రంలో నేడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2.5 డిగ్రీలు అదనంగా పెరగడం వల్ల గాలిలో తేమశాతం తగ్గి ఉక్కపోత అధికమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details