నైరుతి రుతుపనాల రాకతో రాష్ట్రంలో రానున్న ఐదురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కోమరంభీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం... దాని పరిసర ప్రాంతాల్లో జూన్ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది.
తెలంగాణలో ఐదురోజుల పాటు మోస్తరు వర్షాలు
రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు