తెలంగాణ

telangana

ETV Bharat / state

"వర్షాభావం, కరవు వల్ల.. వ్యవసాయం లాభసాటిగా లేదు" - వెంకయ్యనాయుడు

ప్రజల ఆహార అభిరుచులు, అలవాట్లు మారుతున్న తరుణంలో కొత్త వ్యాధులు ప్రబలుతూ మానవాళి ఆరోగ్యం దెబ్బతిస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.  హైదరాబాద్ తార్నాక సీఎస్ఐఆర్ - కణ, అణు జీవశాస్త్ర కేంద్రాన్ని ఆయన సందర్శించారు.

rainfall-drought-agriculture-is-not-profitable
"వర్షాభావం, కరవు వల్ల.. వ్యవసాయం లాభసాటిగా లేదు"

By

Published : Jan 27, 2020, 7:48 PM IST


ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో.. దేశంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు- పరిష్కారాలపై శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ తార్నాక సీఎస్ఐఆర్ - కణ, అణు జీవశాస్త్ర కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అర్చన శివ, శాస్త్రవేత్తలు, ఆచార్యులు పాల్గొన్నారు.

సీసీఎంబీ ప్రాంగణంలో పలు పరిశోధన విభాగాలను వెంకయ్యనాయుడు సందర్శించారు. పని తీరు, పురోగతి, సాధించిన విజయాలపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీసీఎంబీ - ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు. వర్షాభావం, కరవు వల్ల.. వ్యవసాయం లాభసాటిగా లేదని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రఖ్యాత పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు ఆయా సవాళ్ల పరిష్కారంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

"వర్షాభావం, కరవు వల్ల.. వ్యవసాయం లాభసాటిగా లేదు"

ఇవీ చూడండి: సూర్యాపేట 5 మున్సిపాలిటీల్లో 'గులాబీ' ఛైర్మన్​లు

ABOUT THE AUTHOR

...view details