రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మరియు ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఒకటిన్నర కి.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - rainfall chances in telanagana state
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్భ నుంచి తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.
రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు