హైదరాబాద్ గుడిమల్కాపూర్ డివిజన్లోని కరోల్‌బాగ్‌లో కార్పొరేటర్ బంగారి ప్రకాశ్ పర్యటించారు. చిన్న చినుకు పడినా.. తమ ఇళ్లలోకి వరద నీరు చేరుతోందని కరోల్‌బాగ్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటి వల్ల ఫేజ్ 1, 2 కాలనీ వాసుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని కార్పొరేటర్‌కు విన్నవించారు. తమ సమస్యకు పరిష్కారం చూపమని కోరారు.
'వరదనీటి నుంచి పరిష్కారం చూపండి' - Heavy flood in Hyderabad
చిన్న చినుకు పడినా.. ఇళ్లలోకి వరద నీరు చేరుతోందని హైదరాబాద్ గుడిమల్కాపూర్ డివిజన్లోని కరోల్‌బాగ్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని డివిజన్ కార్పొరేటర్ బంగారి ప్రకాశ్‌ను కోరారు.
!['వరదనీటి నుంచి పరిష్కారం చూపండి' rain water management issue in gudimalkapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8891210-805-8891210-1600766587245.jpg)
గుడిమల్కాపూర్‌లో వరద నీటి సమస్య
కాలనీవాసుల సమస్య విన్న కార్పొరేటర్ బంగారి ప్రకాశ్.. వరద నీటి సమస్యకు పరిష్కారంగా స్వామ్ వాటర్ డెన్ ఏర్పాటు చేసి తర్వాత వీడీసీసీ రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. డివిజన్లో కార్పొరేటర్ ప్రకాశ్‌తో పాటు గంగపుత్ర ఈఈ నామ్య నాయక్, ఏఈ విష్ణు వర్ధన్ రెడ్డి పర్యటించారు.