తెలంగాణ

telangana

ETV Bharat / state

వానొస్తే వణికిపోతున్న హైదరాబాద్​ వాసులు - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్​లో గరిష్ఠంగా 2 సెంటీమీటర్ల వాన పడితే చాలు అనేక ప్రాంతాలు వణికిపోతున్నాయి. నాలుగురోజులుగా కురిసిన వర్షానికి కాలనీలు, బస్తీల్లో జనం ఇబ్బందులు పడ్డారు. రహదారులపై వరద పోటెత్తి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గత రెండు దశాబ్దాలతో పోల్చితే నగరంలో అనేక కొత్త ప్రాంతాలు పుట్టుకొచ్చాయి. చిన్న చిన్న ఇళ్ల స్థానాల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు వచ్చాయి. ఈ క్రమంలో వరద, మురుగు నీటి కాల్వలు ఆక్రమణలకు గురై రూపురేఖలు మారిపోతున్నాయి.

rain problems in hyderabad city
వానొస్తే వణికిపోతున్న హైదరాబాద్​ వాసులు

By

Published : Sep 23, 2020, 8:52 AM IST

రాష్ట్ర రాజధానిలో వానొస్తే చాలు జనాలు భయపడిపోతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడం, ట్రాఫిక్​ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల నాలాల్లో పడి చనిపోతున్నారు. 2016లో కురిసిన భారీ వర్షానికి 200 కాలనీలు నీటి మునిగాయి. వేలమంది కొన్ని రోజులపాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెరువులు, వరద కాల్వల ఆక్రమణ ఒక కారణమైతే సరైన మురుగు వ్యవస్థ లేకపోవడం మరో కారణం.

దేళ్ల క్రితం రూ.2867 కోట్ల భారీ వ్యయంతో ప్రణాళిక రచించినా అడుగు ముందుకు పడలేదు. కేవలం శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లో కొంతవరకు పనులు చేపట్టారు. తరచూ అత్తాపూర్‌ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నెంబరు 190 వద్ద వాన నీరు పోటెత్తుతోంది.

ఇదీ చదవండి:ధరణి సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో నేడు సీఎస్​ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details