తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(telangana rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్నటి తీవ్ర అల్పపీడనం కోస్తాంధ్రా తీరం మీదుగా ఇంటీరియర్ ఒడిశా వరకు ఉన్న ఉపరితల ద్రోణి కూడా ఈ రోజు బలహీనపడినట్లు వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్.నాగరత్న తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిక్కుల నుంచి వీస్తున్నట్లు వెల్లడించారు.
నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్(rains in hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. నగరంలోని అసెంబ్లీ, బషీర్ బాగ్ , బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణ గూడ, లిబర్టీ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం ముంచెత్తింది. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చూడండి: