రాష్ట్రంలో ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం రాక కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఉత్తర- దక్షిణ ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్ మెదక్, కామారెడ్డి జిల్లాల్లో.. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల ఐదు రోజులు తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు: ఇందులో భాగంగానే ఈదురు గాలులు గంటలకు 30 నుంచి 40 కిలోమీర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా.. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందనివెల్లడించింది. రాగల ఐదు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వికారాబాద్లో వడగండ్ల వాన: ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపోయింది. సంగారెడ్డిలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల తీవ్రకు చెట్లు, విద్యుత్తు స్థంభాలు కొన్ని నేలకు ఒరిగిపోయాయి. జహీరాబాద్, కోహిర్ మండలాల్లో వడగండ్ల వర్షం పడింది. ఉరుములు, మెరుపులకు ఈదురు గాలులతో మోస్తారగా ప్రారంభమై నుంచి భారీ వర్షం పడింది. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో కూడా వడగండ్ల వాన భీభత్సం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది.