హైదరాబాద్ వాసులను చలి తీవ్రంగా వణికిస్తోంది. చలిగాలులతో గజగజా వణికిపోతున్న నగరాన్ని చిరుజల్లులు పలకరించాయి. అక్కడక్కడా కురిసిన జల్లులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్యాట్నీ, ప్యారడైస్, చిలకలగూడ, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లో ఉదయం నుంచే వర్షం ముసురుకుంది.
అసలే చలి వణికిస్తోందంటే చిరుజల్లొచ్చి చెక్కిలిగింతలు పెట్టింది!
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి. అసలే చలితో వణికిపోతున్న నగరవాసులను చిరుజల్లులు గిలిగా పలకరించి మరింత వణికించాయి. ఎప్పుడెప్పుడొస్తాడో అని సూర్యుని కోసం ఎదురు చూసే జనాలను... చలిగాలులతో కలిసి జల్లులు పులకరింపజేశాయి.
RAIN IN WINTER AT HYDERABAD
చిరుజల్లుల ప్రభావంతో నగరంలో చల్లదనం మరింతగా పెరిగింది. అసలే చలికి వణికిపోతున్న ప్రజలు... ముసురు ప్రభావంతో బయటికి వచ్చేందుకే బయపడుతున్నారు.
ఇదీ చూడండి:రివ్యూ 2019: గత ఐదేళ్లలో ఈసారే తక్కువ ఐపీఓలు