హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని సికింద్రాబాద్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్, బాలానగర్, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, సూరారం, దూలపల్లి, బహదూర్‌పల్లి, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ వర్షం పడింది. మేడ్చల్, గచ్చిబౌలి, మాదాపూర్, మూసాపేట్, ఎల్లమ్మబండ, వివేకానందనగర్, వనస్థలిపురం, నాచారం, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంటలో తొలకరి వర్షం నగరవాసిని పలకరించింది.
నగరవాసిని పలకరించిన తొలకరి జల్లులు - భాగ్యనగరంలో వర్షం
గత రెండు రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసిని వర్షపు జల్లులు పలకరించాయి. ఒక్కసారిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరంలో సుమారు 2గంటలకు పైగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
నగరవాసిని పలకరించిన తొలకరి జల్లులు
వర్షం ధాటికి పేట్‌బషీరాబాద్ సమీపంలో చెట్టు కూలడం వల్ల ఆటో ధ్వంసమైంది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపునీరు నిలవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆకస్మికంగా కురిసిన వర్షంతో నగరం చల్లబడింది.
ఇవీ చూడండి: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు...!