నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. భానుడి భగభగలకు సాయంత్రం కురిసిన వర్షానికి నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు. హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఎండవేడిమితో అల్లాడిన జనాలు సాయంత్రం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. ఖైరతాబాద్, నాంపల్లి, లక్డికపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన హైదరాబాద్ నగరం - చల్లబడిన హైదరాబాద్
వేసవి తాపంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ వరుణుడు కరుణించాడు. వేసవి తాపాన్ని తట్టుకోలేక పోతున్న నగరవాసులకు వర్షం కొంత ఊరటనిచ్చింది.
వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన హైదరాబాద్ నగరం
సికింద్రాబాద్లోని బోయిన్పల్లి తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ మారేడిపల్లి, ప్యాట్ని, పారడైస్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి. అల్పపీడన ప్రభావం మూలంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. వేసవితాపం ఉన్న వేళలో మధ్యాహ్నం వేళ చల్లటి గాలులతో నగరవాసులు ఎంజాయ్ చేశారు.
ఇదీ చూడండి:స్వస్థలాల బాటలో వలసజీవులు