ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జంట నగరాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, అంబర్‌పేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, పటాన్‌చెరు, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, రామంతాపూర్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, సికింద్రాబాద్, బేగంపేట, ప్యారడైజ్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మొయినాబాద్, ఆల్వాల్, చిలకలగూడ, మారేడ్‌పల్లి, ఉప్పల్, బోడుప్పల్, ఘట్‌కేసర్, హస్తినాపురం, లంగర్‌హౌస్, కార్వాన్, గోల్కొండ, మెహదీపట్నం, మలక్‌పేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది.