Hyderabad Rains Today: భాగ్యనగరం చిరుజల్లులతో చిత్తడి అవుతోంది. ఓ వైపు చలి.. మరోవైపు చిరుజల్లులతో నగరవాసులు గజగజ వణుకుతున్నారు. గత రెండు రోజుల నుంచి పొగమంచు దట్టంగా కురుస్తుండగా.. నేడు చిరుజల్లులు కురవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వేకువజాము నుంచి వర్షం పడుతోంది. ఈ చలికాలంలో వర్షం ఏంట్రా అనుకుంటూ నగరమంతా వణికిపోతోంది.
'ఓ వైపు చలి.. మరోవైపు వాన'.. కూల్‌కూల్‌గా హైదరాబాద్..! - ఈరోజు హైదరాబాద్‌లో వర్షం
Hyderabad Rains Today : ఓవైపు చలి వణికిస్తోంటే.. అగ్గికి ఆజ్యం పోసినట్లు మరోవైపు వాన ఊపందుకుంది. చలికాలంలో వర్షం ఏంట్రా బాబు అని హైదరాబాద్ నగరవాసులు వణుకుతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి నగరంలోవర్షం పడుతోంది. చలికి వాన తోడవటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
హైదరాబాద్‌లో వర్షం
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చింతల్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట, తార్నాక్, హబ్సిగూడ మొదలైన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి. ఉదయాన్నే వాన కురుస్తుండటంతో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ఇతర పనులపై బయటకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇవీ చదవండి: