తెలంగాణ

telangana

ETV Bharat / state

RAINS: భాగ్యనగరంలో భారీవర్షం.. కాలువలుగా మారిన రహదారులు - telangana varthalu

హైదరాబాద్​లోని పలు చోట్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుమార్లు కురిసిన వర్షంతో చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. సాయంత్రం వేళ కురిసిన వానతో వాహనదారులు 6 గంటలలోపు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. పలుకూడళ్ల వద్ద పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడం కనిపించింది.

rain in hyderabad city
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం

By

Published : Jun 10, 2021, 3:37 PM IST

Updated : Jun 10, 2021, 9:36 PM IST

నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, నిజాంపేట్​, సోమాజిగూడ, నాంపల్లిలో వాన పడింది.

చింతల్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, కొంపల్లి, బాలానగర్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరింది. పాతబస్తీలోనూ చిరుజల్లులుగా మొదలై భారీవానగా మారింది. సుమారు అరగంట పాటు కురిసిన వర్షంతో చంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమా, ఛత్రినాక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.

ముషీరాబాద్, రాంనగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, విద్యా నగర్‌, అడిక్​మెట్​, గాంధీనగర్, కవాడిగూడ, భోలక్‌పూర్‌లో వర్షం కురిసింది. ఈ ప్రాంతాలతో పాటు బోరబండ, అల్లాపూర్​, మోతీనగర్​, ఎర్రగడ్డ, సనత్​నగర్​, అమీర్​పేట, బోయిన్​పల్లి, మారేడ్​పల్లి, జేబీఎస్​, బేగంపేటలో కూడా వాన పడింది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో.. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని కొన్ని చోట్ల వర్షపు నీటి వల్ల ట్రాఫిక్​ నిలిచిపోగా... వాహనాలను నియంత్రించేందుకు ట్రాఫిక్​ పోలీసులు చర్యలు తీసుకున్నారు.

మేడ్చల్​ జిల్లాలోని ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలలో కురిసిన వర్షానికి విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

ఇదీ చదవండి: వింత ప్రేమకథ- పదేళ్లుగా ఒకే గదిలో యువతి

Last Updated : Jun 10, 2021, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details