హైదరాబాద్‌లో మోస్తరు వర్షం.. రాష్ట్రంలోనూ వానలు ఉత్తర కోస్తా తీరం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం 1.5 కిమీ నుండి 3.1 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దక్షిణ మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాలలో 0.9 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. రాష్ట్రంలో ఈరోజు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం పడింది. ఖైరతాబాద్, బేగంపేట, పంజాగుట్ట, మెహదీపట్నం, లంగర్‌హౌజ్, షేక్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, బోయిన్పల్లి, బాలానగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది
ఇదీ చదవండి: పార్లమెంట్ భవనం రెడ్‌స్టోన్‌ను పరిశీలించిన ప్రశాంత్‌రెడ్డి