క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈసీఐఎల్, నాగారం, జవహార్‌నగర్, కీసర, దమ్మాయిగూడ, నాంపల్లి, ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్, కొత్తపేట, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, ముసారాంబాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
రాజధానిలోని పలు ప్రాంతాల్లో వర్షం సికింద్రాబాద్ పరిధిలో..
సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి, బేగంపేట, చిలకలగూడ, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లోనూ వర్షం పడింది.
హైదరాబాద్ శివార్లలో..
హైదరాబాద్ శివార్లలోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. దుండిగల్, దూలపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, మేడ్చల్, కొంపల్లిలో ఓ మోస్తరు వర్షం పడింది. రోడ్లపైకి నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.
రాజధానిలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. ఈ ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
ఇదీచూడండి: క్యూములోనింబస్ ప్రభావం.. నగరంలో వర్షం