Rain in Hyderabad: భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న భాగ్యనగరవాసులకు రెండు రోజులుగా కురుస్తున్న వర్షం ఉపశమనం కలిగిస్తోంది. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు, వర్షం కురిసింది.
Rain in Hyderabad: హైదరాబాద్‌లో వరుసగా రెండోరోజు పలు ప్రాంతాల్లో వర్షం - hyderabad rains
Rain in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. వాన చినుకులతో వాహనదారులు తడిసిముద్దయ్యారు.
హైదరాబాద్‌లో వర్షం
నగరంలోని ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, బషీర్ బాగ్, లక్డీకాపూల్, అబిడ్స్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. వర్షం పడుతుండటంతో వాహనదారులు తడిసిముద్దయ్యారు. ద్విచక్రవాహనదారులు, పాదచారులు.. తడవకుండా చెట్ల కింద, దుకాణాల ఎదుట కాసేపు సేదతీరారు.
ఇదీ చదవండి:TS Weather Report: రాష్ట్రంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం