తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు - telangana rains
ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహా అన్ని చోట్లా రాగల మూడు రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, గాలి విచ్ఛిన్నతి వల్లే రాష్ట్రంలో వర్షాలని పేర్కొంది.
తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు
ఉపరితల ఆవర్తనం, గాలి విచ్ఛిన్నతి వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో మా ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.