నైరుతి మధ్యప్రదేశ్ నుంచి కోమరిన్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. మధ్య మహరాష్ట్ర, కర్ణాటక, కేరళ మీదుగా ఉపరితల ద్రోణి వ్యాపించింది. దీనితో ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడనుంది. రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశముంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమూ ఉంది.
తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి జల్లులు
సూర్యుడు భగ్గుమంటున్న వేళ.. ఓ చల్లని కబురునిచ్చింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి జల్లులు