తెలంగాణ

telangana

ETV Bharat / state

జంటనగరాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షం - జంటనగరాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షం

జంటనగరాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

జంటనగరాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షం

By

Published : Aug 3, 2019, 6:54 AM IST

Updated : Aug 3, 2019, 7:45 AM IST

భాగ్యనగరంలో 24 గంటలుగా ఏకదాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఉప్పల్‌, దిల్‌సుఖ్నగర్‌, ఎల్‌బీనగర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట, అమీర్‌పేట, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరింది. ఆదర్శనగర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్​ వద్ద చెట్టు కూలి రహదారికి అడ్డంగా పడిపోయింది. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సత్వరమే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.

జంటనగరాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షం
ఇదీ చూడండి: విస్తారంగా కురుస్తున్న వర్షాలు..!
Last Updated : Aug 3, 2019, 7:45 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details