తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో భారీవర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - rain effect in hyderabad

భాగ్యనగరంలో నిన్న కురిసిన భారీవర్షానికి రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది.

పాఠశాల ఆవరణలో నీరు

By

Published : Sep 27, 2019, 10:59 PM IST

పాఠశాల ఆవరణలో నీరు

వర్షాలతో హైదరాబాద్​ నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖైరతాబాద్‌ చౌరస్తా సమీపంలోని పెట్రోల్‌ పంపు వద్ద భారీగా వరద చేరింది. జీహెచ్‌ఎంసీ అధికారులు మోటార్‌ పంపుల ద్వారా నీటిని బయటకు పంపారు. ఉదయం నుంచి భారీ వరద కారణంగా ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నీరుచేరి.. చిన్న కుంటను తలపించింది. కూకట్​పల్లి శంశిగూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మోకాలు లోతు నీరు చేరింది. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తరగతుల గదులలోకి వెళ్లేందుకు కష్ట పడాల్సి వచ్చింది. ఉపాధ్యాయులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల సిబ్బంది వచ్చి మోటార్ల సాయంతో నీటిని తరలించారు.

ABOUT THE AUTHOR

...view details