Rain Effect in Hyderabad :గత 48 గంటలుగా అతి భారీ వర్షాలు కురుస్తుండగా, నిన్నటి నుంచి మరింత జోరందుకున్నాయి. వానలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. కుత్బుల్లాపూర్, మియాపూర్, మేడ్చల్ ప్రాంతాల్లో అనేకకాలనీలు జలమయమయ్యాయి.
Hyderabad Rains Today :మేడ్చల్ రూరల్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ నీట మునిగింది. ఇక్కడి పదుల సంఖ్యలోని వసతిగృహాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులు ఉంటున్నారు. వర్షాలకు హాస్టళ్లన్నీ నీట మునిగి ఒకటో అంతస్తు వరకు నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు (Rain Affect in Hyderabad) పడ్డారు. అధికారులు విద్యార్థులను ట్రాక్టర్లు, జేసీబీల్లో తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 8 గంటల మధ్య 10 సెం.మీ భారీ వర్షం కురవడంతో ఎక్కువ నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు మియాపూర్ ప్రాంతంలో 18 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇదే తంలోని పటేల్ చెరువుకు గండి పడింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దాదాపు 12 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
Telangana Heavy Rains Today : రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వర్షం.. జలమయమయిన ప్రాంతాలు
Hyderabad Rains Updates :కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట, కేపీహెచ్‌బీ కాలనీ, ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, బేగంపేట, సికింద్రాబాద్, చిలకలగూడ, ఉప్పల్, మలక్‌పేట, అంబర్‌పేట, పాతబస్తీ, ఖాజాగూడ, ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లలో భారీ వర్షం నమోదైంది. అమీర్‌పేట నుంచి జేఎన్‌టీయూకు, మెహదీపట్నం నుంచి హైటెక్ సిటీకి రాకపోకలు నిలిచిపోయాయి. ఆరాంఘర్, ఈఎస్‌ఐ, ఎర్రగడ్డ, బల్కంపేట ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు, ఓ అంబులెన్సు వరదలో చిక్కుకుపోయాయి. లంగర్‌హౌజ్‌లోని లక్ష్మీనగర్‌లో ఇళ్లలోకి మురికినీరు చేరింది. దుండిగల్ ప్రాంతంలోని మల్లంపేట పీవీఆర్ మెడోస్ కాలనీ, భౌరంపేట్‌లోని ల్యాండ్ మార్క్-2 కాలనీలు జలమయమయ్యాయి.
Heavy Flood in Musi River : భారీ వర్షాల వేళ హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు (Twin Reservoirs) ఎత్తివేయడంతో పురానాపూల్ వద్ద మూసీ ఉప్పొంగుతోంది. పరివాహక ప్రాంతంలో పరిస్థితిని అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ పర్యవేక్షించి... స్థానికులను అప్రమత్తం చేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో వరద ప్రాంతాల్లో మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే వివేకానంద పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు బాధితులను కాపాడేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. టోలీచౌకి వద్ద విధులు నిర్వహిస్తున్న సౌత్ వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి ఫ్లైఓవర్ వద్ద నీళ్లు నిండిపోవడంతో మ్యాన్‌హోల్‌పై పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలగించారు.