తెలంగాణ

telangana

ETV Bharat / state

వానాకాలం ఎఫెక్ట్ : దుర్గంధంతో ఆ కాలనీ వాసులకు నరకయాతన - జీహెచ్​ఎంసీ అధికారులు

వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ కూకట్​పల్లి ధరణినగర్ వాసులు రసాయనాల నురుగు ఘాటు వాసనలకు ఇబ్బందులు ఎదురుకోవాల్సిన దుస్థితి. ఒక్క మానవాళి మనుగడకే కాదు ధరణి నగర్ నాలా చుట్టూ ఉన్న పచ్చని చెట్లు వాటిపై ఉండే పక్షులు సైతం రసాయన నూరుగుకు బలవుతున్నాయి.

వానాకాలం ఎఫెక్ట్ : దుర్గంధంతో ఆ కాలనీ వాసులకు నరకయాతన
వానాకాలం ఎఫెక్ట్ : దుర్గంధంతో ఆ కాలనీ వాసులకు నరకయాతన

By

Published : Aug 14, 2020, 2:28 PM IST

హైదరాబాద్ పరిధిలోని కూకట్​పల్లి ధరణినగర్ వాసులు రసాయనాల నురుగు ఘాటుతో నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తమ నివాస పరిసర స్థలాల్లో ఈ రసాయన వాసనలతో కూడిన గాలితో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గాలికి ఎగిరి రసాయన నురుగు పిట్ట గూట్లకు అంటుకుంటుండటం వల్ల పిట్ట గూడులను పక్షులు వదిలి వెళ్తున్నాయి.

పక్షలు సైతం..

పక్షులు తమ గూడుల్లో ఉండాల్సినవి... రసాయనాల నురుగు వల్ల గూడులను వదిలి వెళ్లాల్సిన దీన స్థితి. బల్దియా అధికారులు స్పందించి నాలాల్లో పొంగి పొర్లుతున్న నురుగును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని జీహెచ్​ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్​... అలసత్వం వహిస్తే షోకాజ్ నోటీస్​

ABOUT THE AUTHOR

...view details