తెలంగాణ

telangana

ETV Bharat / state

వడగాలులు, తేలికపాటి వర్షాలు - weather

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్నిచోట్ల  రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

వాతావరణ శాఖ

By

Published : Jun 14, 2019, 6:03 AM IST

ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో 3.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్నిచోట్ల రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు, రేపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

వడగాలులు, తేలికపాటి వర్షాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details