హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, మలక్పేట, చిలకలగూడ, మారేడ్పల్లి, బోయిన్పల్లి, ప్యారడైస్, ప్యాట్నీ, జేబీఎస్, వనస్థలిపురం, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో వాన కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్ తదితర ప్రాంతాలలో కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. మలక్పేట గంజ్లోకి నీరు చేరడం వల్ల వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మురికివాడల్లోకి వర్షంతో పాటు మురుగునీరు ఇళ్లల్లోకి చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
భాగ్యనగరంలో జోరుగా వర్షం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు ప్రారంభించింది.
జోరుగా వర్షం