నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో నగరంలోని ఖైరతాబాద్, ముషీరాబాద్, దిల్‌సుఖ్‌నగర్, తిరుమలగిరి, ప్యారడైజ్, సంగీత్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌లోకేశ్ కుమార్‌ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నీరు నిలిచిన చోట వెంటనే నీటి తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు.
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం
ఉదయం ఉక్కపోత వాతవరణంతో ఇబ్బంది పడ్డ నగరవాసులకు.. సాయంత్రం కురిసిన వర్షానికి కాస్త ఊరట కలిగింది. నగరంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.
పలు ప్రాంతాల్లో వర్షం.. అప్రమత్తంగా ఉండాలి