రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకట్రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలున్నాయని ప్రకటన విడుదల చేసింది.
TS WEATHER REPORT: రాష్ట్రంలో రాగల 3 రోజులు మోస్తరు వర్షాలు - telangana rains alert
రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని వెల్లడించింది.
![TS WEATHER REPORT: రాష్ట్రంలో రాగల 3 రోజులు మోస్తరు వర్షాలు telangana rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12566786-835-12566786-1627196188867.jpg)
తెలంగాణలో వర్షాలు
ఇవాళ కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వివరించారు.
ఇదీ చదవండి:Lashkar Bonalu : లష్కర్ బోనాల ఉత్సవం.. భాగ్యనగర ప్రజల కోలాహలం