తెలంగాణ

telangana

Rain alert: రాగల మూడు గంటల్లో ఆ జిల్లాలకు వర్షసూచన

By

Published : Oct 8, 2021, 9:58 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rain alert: రాగల మూడు గంటల్లో ఆ జిల్లాలకు వర్షసూచన
Rain alert: రాగల మూడు గంటల్లో ఆ జిల్లాలకు వర్షసూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. రాగల మూడు గంటల్లో మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

రాగల 3 రోజులు తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కింది స్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణలోకి వస్తున్నట్టు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడినట్టు పేర్కొంది. ఈనెల 10న ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి రానున్న 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకొనే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి: RAIN IN HYDERABAD: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details