తెలంగాణ

telangana

ETV Bharat / state

దయనీయంగా మారిన రైల్వే కూలీల పరిస్థితి

రైల్వే స్టేషన్​కు రైలు వచ్చిందంటే చాలు... దిగిన ప్రయాణికుల నుంచి లగేజ్ కోసం కూలీలు వెంబడిస్తారు. వచ్చిన డబ్బులతో వారు జీవనం గడిపేస్తారు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు వారి పరిస్థితి దుర్భరంగా మారింది. కొవిడ్​ మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో విమాన, రైల్వే ప్రయాణాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ప్రజలు ప్రయాణాలు తగ్గించారు. అత్యవసరమయితే తప్ప ప్రయాణాలు చేయడం లేదు. ఈ క్రమంలో ప్రయాణికులు లేక.. వచ్చిన కొంత మంది లగేజ్​ ఇవ్వక, కూలీలకు పని లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

railway workers problems, hyderabad railway labour problems
దయనీయంగా మారిన రైల్వే కూలీల పరిస్థితి

By

Published : Apr 22, 2021, 8:40 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విజృభిస్తోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల రాత్రి పూట కర్వ్ఫూ కొనసాగుతోంది. ఇంకొన్ని చోట్ల లాక్​డౌన్ పెడుతున్నారు. ప్రయాణాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్​ నాంపల్లి రైల్వే స్టేషన్​ వద్ద లైసెన్స్​ కూలీల పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు 70 మంది ఉండే కూలీలు పూర్తిగా రావడం కూడా మానేశారు.

పని కోసం రైల్వే కూలీల పడిగాపులు

పనికి వస్తున్న 20 మందికి కూడా పని దొరకడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం ముంబయి రైలులో 20 మంది ప్రయాణికులు మాత్రమే వచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు వచ్చిన వారు తమ సామాన్లు వేరే వారికి ఇవ్వాలంటే జంకుతున్నారు. ఎవరికీ కరోనా ఉందో అన్న కోణంలో సామాన్లు ఇవ్వడం లేదు.

ఈ విధంగా తమకు పని లేకుండా నష్టపోతున్నామని కూలీలు అంటున్నారు. ఇంటి నుంచి పనికోసం స్టేషన్​కు వచ్చినప్పటికీ... తమ ప్రయాణ ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని వాపోతున్నారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో రవాణా ఛార్జీల కోసం ఇంకా అదనంగా ఖర్చుచేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

ఇదీ చూడండి :ఏపీలో రికార్డు స్థాయిలో 10,759 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details