మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు అక్రమార్జనకు పాల్పడుతూ రైల్వే ఆదాయానికి గండికొడుతున్న యువకుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన రాకేశ్ కుమావత్ ఏఎన్ఎంఎస్ యాప్ ద్వారా దొంగ ఐడీలను సృష్టించాడు. తత్కాల్ టికెట్లను బుకింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక్కొ టికెట్‌కు 200 నుంచి 500 వరకు కమిషన్ తీసుకుంటూ రైల్వే ఆదాయానికి గండి కొడుతున్నాడు. నిఘాపెట్టిన రైల్వే విజిలెన్స్ అధికారులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 9 ఏటీఎం కార్డులు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.