సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 10 మంది రైల్వే పోలీసులు కరోన బారిన పడ్డారు. సీఐ సహా మరో 9 మంది కానిస్టేబుళ్లలకు మహమ్మారి సోకింది. వీరందరూ హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఒక్క సరిగా రైల్వే కానిస్టేబుళ్లకు 10 మందికి వైరస్ రావడం వల్ల వారివారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
కరోనా బారిన 10 మంది సికింద్రాబాద్ రైల్వే పోలీసులు
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. తాజాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 10 మంది రైల్వే పోలీసులు కొవిడ్ బారిన పడ్డారు.
కరోనా బారిన 10 మంది రైల్వే పోలీసులు
రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా రావడం వల్ల ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంటుంది. వలస కార్మికుల తరలింపు విషయంలో, లాక్డౌన్ ముగిసిన అనంతరం రైల్వేవ్యవస్థ తిరిగి ప్రారంభమవడం వల్ల వారు విధులు నిర్వహిస్తున్న సమయంలో వారు కొవిడ్ బారిన పడ్డారు.
ఇవీ చూడండి:మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు